వరిలో ఆకుముడత

వరిలో ఆకుముడత

ఆకు ముడత వేరుశనగ, వరి, పత్తి, కంది,

మరియు కూరగాయలలో ఎక్కువ వస్తుంది.

పురుగు ఆశించు కాలం: జూన్‌ – అక్టోబర్‌

పురుగు ఆశించక ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

పొలంలో నీరు ఎక్కువగా నిలిచి ఉండకుండా చూడాలి.
8-20 కిలోల వేప పిండిని ఆఖరి దుక్కిలో వేసి కలియ దున్నుకోవాలి.
నివారణ:

పొలంపై ఒక ముళ్ళ కంపని లాగుతూ వెళ్ళడం వలన ఆకుముడతలు విడిపోయి లార్వా నీటిలో పడి చనిపోతుంది.
రెక్కల పురుగులను గమనించినప్పుడు 5శాతం వేప కషాయం పిచికారీ చేయాలి.
లార్వా చిన్న దశలో అదుపు చేయడానికి పచ్చిమిర్చి వెల్లుల్లి కషాయం పిచికారి చేయాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *