వరిలో ఆకుముడత – సుస్థిర వ్యవసాయ కేంద్రం

వరిలో ఆకుముడత

ఆకు ముడత వేరుశనగ, వరి, పత్తి, కంది, 

మరియు కూరగాయలలో ఎక్కువ వస్తుంది. 

పురుగు ఆశించు కాలం: జూన్‌ – అక్టోబర్‌

పురుగు ఆశించక ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

  • పొలంలో నీరు ఎక్కువగా నిలిచి ఉండకుండా చూడాలి.
  • 8-20 కిలోల వేప పిండిని ఆఖరి దుక్కిలో వేసి కలియ దున్నుకోవాలి. 

నివారణ: 

  • పొలంపై ఒక ముళ్ళ కంపని లాగుతూ వెళ్ళడం వలన ఆకుముడతలు విడిపోయి లార్వా నీటిలో పడి చనిపోతుంది. 
  • రెక్కల పురుగులను గమనించినప్పుడు 5శాతం వేప కషాయం పిచికారీ చేయాలి. 
  • లార్వా చిన్న దశలో అదుపు చేయడానికి పచ్చిమిర్చి వెల్లుల్లి కషాయం పిచికారి చేయాలి. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *