ఎర్ర గొంగళి పురుగు

ఎర్ర గొంగళి పురుగు

పురుగు ఆశించు కాలం: జూన్‌ – ఆగస్టు

పురుగు ఆశించక ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

  • వేప పిండిని ఆఖరి దుక్కిలో వేసుకుని కలియ దున్నుకోవాలి. దీని వలన గొంగళి పురుగు పొలంలోకి ప్రవేశించదు. 
  • ఎకరం పొలంలో 10 వేప ఆకుల గుత్తులను 10 వేరు వేరు స్థలాలలో ఉంచుకోవాలి. 
  • ఎకరానికి 10 కిలోల కొయ్య బూడిదను ఇసుకలో కలిపి పొలంలో చల్లుకోవాలి. 

నివారణ :

  • లోతుగా వేసవి దుక్కులు చేసుకొని నిద్రావస్థదశలను నిర్మూలించాలి.
  • తొలకరి జల్లులు పడగానే మొదలుపెట్టి 30-45 రోజులపాటు పొలంలో దీపపు ఎరలు (100-250 వాట్స్‌ బల్బు) లేదా మంటలు వేసి తల్లి పురుగులను ఆకర్షించి నాశనం చేయవచ్చు. 
  • ఎరపంటలైన జిల్లేడు, అడవి ఆముదం కొమ్మలను చాళ్ల వెంట పరచి లార్వాలను వాటిపైకి ఆకర్షించి నాశనం చేయవచ్చు. 
  • పొలంచుట్టూ గోతులు తవ్వి, బూడిద ఒక పొరగా వేస్తే వలసపోయే పురుగులను బందించి నాశనం చేయవచ్చు. 
  • పచ్చిమిర్చి వేప వెల్లుల్లి పొగాకు ద్రావణాన్ని పిచికారీ చేసి నివారించవచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *