కేంద్ర విత్తన చట్టం – 2019 ముసాయిదా

కేంద్ర ప్రభుత్వం విత్తన చట్టం-2004కు 2010లో సవరణ తెచ్చింది. ఈ చట్టాలు పార్లమెంట్లో ఆమోదానికి పెట్టలేదు.

ప్రస్థుతం కేంద్ర 2014 చట్టానికి సవరణలు తేస్తూ ”విత్తన చట్టం -2019 ముసాయిదాను” చర్చకు విడుదల చేసింది. 2014లోని చట్టాలు, 2019 సవరణలు ఈ దిగువ చర్చించబడినాయి.

అధ్యాయం -1

ప్రాధమికమైనవి

సెక్షన్ -1, చట్టం టైటిల్

                2004        2019

                55వ సంవత్సరం 70వ సంవత్సరం

                చట్టం 2004             చట్టం 2019

సెక్షన్ -2, పదాల వివరణ

  • ”వ్యవసాయం” – అనగా హార్టికల్చర్ అడవులు, మొక్కల సాగు పంటలు, ఔషధ, సుగంధపరమైన మొక్కలు
  • ”రైతు” – అనగా స్వంత భూమి సాగు లేదా ఇతర విధాలుగా సాగు లేదా వ్యవసాయ పనుల గురించి రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు చెప్పిన పనులు చేయువారు.
  • ”నేషనల్ సీడ్ వెరైటీస్” – ఒకటికి మించిన రాష్ట్రాలలో సాగుచేస్తున్న విత్తన రకాలు
  • ”నోటిఫికేషన్” – అధికార గెజిట్లో ప్రకటించడం.

అధ్యాయం-2

కేంద్ర విత్తన కమిటీ మరియు సబ్ కమిటీల రిజిస్ట్రేషన్

3.             కేంద్ర విత్తన కమిటీ రిజిస్ట్రేషన్ – సబ్ కమిటీల నియామకం

4.             విత్తన కేంద్ర కమిటీ కూర్పు

  • ఛైర్పర్సన్-సభ్యులు-ఎక్స్ అఫిషియో- ఇతర సభ్యులు – కేంద్ర ప్రభుత్వంచే నామినేట్ చేయబడతారు.
  • కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి – వ్యవసాయ – సహకార – రైతు సంక్షేమ శాఖ-వ్యవసాయ మంత్రిత్వశాఖకు చెందిన వారు ఛైర్పర్సన్గా ఉంటారు. (ఎక్స్ అఫిషియో)

ఎక్స్ అఫిషియో సభ్యులు

1.             భారత వ్యవసాయ కమీషనర్

2.             డిప్యూటి డైరెక్టర్ జనరల్ (క్రాఫ్ సైన్స్) ఐసిఎఆర్

3.             డిప్యూటి డైరెక్టర్ జనరల్ (హార్టికల్చర్ సైన్స్), ఐసిఎఆర్

4.             భారత విత్తన ఇంచార్జ్ జాయింట్ సెక్రటరీ

5.             భారత హార్టికల్చర్ కమీషనర్

6.             బయోటెక్నాలజీ డిపార్ట్మెంట్ రిప్రజెంటేటివ్

7.             భారత పర్యావరణ శాఖకు చెందిన జాయింట్ సెక్రటరీ ¬దా కలిగిన వారు

8.             జాతీయ ఔషధ మరియు సుగంధపరమైన మొక్కల పెంపకపు డైరెక్టర్

9.             మొక్కల పరిరక్షణ రైతుల హక్కుల అథారిటీ ఛైౖర్మెన్

10.           జాతీయు బయోడైవర్శిటీ అథారిటీ ఛైౖర్మెన్

                వీరు కాక 8 మంది సభ్యులుంటారు.

                5. కమిటీ విధులు

                6. విత్తన నాణ్యత

                విత్తన నాణ్యతకు గతంలో కమిటీ నోటిపై చేయాల్సి ఉండగా దానిని-2019లో కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేయాలని మార్చబడింది.

రైతు సంఘాల సూచన :

సెక్షన్ 6లో విత్తన నాణ్యత విషయంలో జర్మినేషన్ మరియు స్వచ్ఛతపై స్పష్టమైన వివరణ ఉండాలి. జర్మినేషన్ 80శాతం ఉండాలి. అంతకు తక్కువ ఉంటే లైసన్స్ రద్దు చేయాలి. స్వచ్ఛత 100శాతం ఉండాలి.

7.             సబ్ కమిటీ – ఇతర కమిటీల రిజిస్ట్రేషన్ మరియు వాటి బాధ్యతలు

8.             కమిటీ-సబ్ కమిటీల బాధ్యత

9.             కార్యదర్శి మరియు ఇతర అఫీస్ బేరర్లు కమిటీ

10.           కమిటీ సమావేశాలు

11.           రాష్ట్ర విత్తన కమిటీలు

                – రాష్ట్ర విత్తన రకాలను 2019 ప్రకారం రిజిస్ట్రి చేయాలి. హార్టికల్చర్కు బదులు పండ్ల తోటల నర్సరీలుగా మార్పు చేశారు.

మన సూచన :

సెక్షన్ 11లో రాష్ట్ర కమిటీలో ముగ్గురు రైతు ప్రతినిధులను (ఒకరు మహిళ) నియమించాలి.

అధ్యాయం – 3

విత్తన రకాలు, వెరైటీల రిజిస్ట్రేషన్

12.           జాతీయ విత్తనాల రిజిస్ట్రేషన్ – విత్తన రకాలు మరియు ప్రత్యేకతలు

13.           జాతీయ విత్తన రకాలు మరియు రాష్ట్రాల విత్తన రకాలు – రిజిస్ట్రేషన్

14.           ఇతర ప్రత్యేక విత్తనాల రిజిస్ట్రేషన్

15.           రిజిస్ట్రేషన్ విధానం

16.           జన్యుమార్పిడి రకాల ప్రత్యేక ప్రోవిజన్ కొరకు రిజిస్ట్రేషన్

17.           విత్తన రకాలు మరియు వెరైటీల రిజిస్ట్రేషన్ రద్దు పరుచుట

18.           రిజిస్ట్రేషన్ రద్దు పరుచుటానికి నోటిపికేషన్ విడుదల చేయుట

19.           విత్తన రిజిస్ట్రేషన్ నుండి కొన్ని రకాలను మినహాయించుట (పర్యావరణానికి నష్టం, వాణిజ్య దోపిడి రకాలను)

20.           విత్తన ట్రయల్స్ను సమీక్షించడం

21.           రైతుకు నష్టపరిహారం

– రైతు సంపెనీ నుండి కొనుగోలు చేసిన విత్తనం నాశిరకం అయి రైతు నష్టపోయినచో వినియోగదారుల చట్టం 1986 ప్రకారం (68/1986) పరిహారం చెల్లించాలి.

మన సూచన :

సెక్షన్ 21లో రైతు నాశిరకం విత్తనం వలన నష్టపోయినచో కంపెనీ లేదా దుకాణదారుడు రైతుకు మొత్తం పంట నష్టం చెల్లించాలి. ముందు ప్రభుత్వం చెల్లించి ఆ తరువాత కంపెనీ నుండి రియంబర్స్ చేసుకోవాలి. పంట నష్టం అనగా మొత్తం పంట దిగుబడి నష్టాన్నీ పరిగణలోకి తీసుకోవాలి. కంపెనీ లైసన్స్ రద్దు చేయాలి. లైసన్స్ను అతని కుటుంబ సభ్యులకుగాని, బందువులకుగాని ఇవ్వారాదు. పి.డి చట్టాన్ని అమలు చేయాలి. కంపెనీ లైసన్స్ హోల్డర్కు 5 సంవత్సరాలు జైలు శిక్ష, రూ.5 లక్షల జరిమాన విధించాలి.

22.           విత్తన ఉత్పత్తిదారులు, ప్రొసెసింగ్ యూనిట్స్ రిజిస్ట్రేషన్ చేయుటు

23.           విత్తన అమ్మకం డీలర్లు రిజిస్ట్రేషన్ చేయుట

మన సూచన :

సెక్షన్ 23లో మైనర్లను డీలర్లుగా నియమించరాదు. వ్యవసాయ శాఖ ప్రాధమిక డిగ్రీ ఉన్నవారికే డీలర్ లైసన్స్ ఇవ్వాలి. (ఉదా. మెడికల్ షాప్లకు బి పార్మసీ సర్టిపికేట్ ఉండాలి.) కాలం గతించిన (ఆవుట్ డెటేడ్) విత్తనాలు అమ్మినచో ఒక సంవత్సరం జైలు శిక్ష మరియు రూ.5లక్షలు జరిమాన విధించాలి. డీలర్లు కంపెనీపై భాద్యత నెట్టరాదు. స్వచ్చత గల విత్తనాలనే అమ్మాలి. కంపెనీతోపాటు డీలర్కూడా రైతుకు భాద్యత వహించాలి.  

24.   పండ్ల మొక్కల నర్సరి రిజిస్ట్రేషన్ చేయుట

మన సూచన :

సెక్షన్ 24లో ప్రతి పండ్ల మొక్కల నర్సరి హెక్టార్కు లోపు ఉన్నప్పటికీ లైసన్స్ పోందాలి. నాణ్యతలేని మొక్కలు ఉత్పత్తి చేసినచో రెండు సంవత్సరం జైలు శిక్ష మరియు రూ.5 లక్షలు జరిమాన విధించాలి. రైతుకు ఎకరాకు లక్ష రూపాయాలు పరిహారం నర్సరి లైసన్స్దారుడు చెల్లించాలి.  

25. పండ్ల నర్సరి రిజిస్ట్రేన్దారుల భాద్యతలు

అధ్యాయం-4

విత్తన దృవీకరణ సంస్థలు మరియు విత్తన అమ్మకాల క్రమబద్దికరణ

26. రిజిస్ట్రీ అయిన విత్తన అమ్మాకాలను, రకాలను క్రమబద్దికరించుట

27. అత్యవసర పరిస్థితిలో అమ్మకం ధర క్రమబద్దికరించుట

28. రాష్ట్ర విత్తన దృవికరణ ఎజెన్సీ

29. విత్తన దృవీకరణ ఎజెన్సీ అక్రీడెషన్

30. రాష్ట్ర విత్తన దృవీకరణ సంస్థ ద్వారా సర్టిపికేట్ ఆమోదించుట

31. సర్టిపికేట్ రద్దు పరుచుట

32.           భారతదేశానికి బయట విత్తన దృవీకరణ సంస్థ ఆమోదం.

అధ్యాయం -5

అప్సీల్స్

33.           అప్పీల్స్

అధ్యాయం-6

విత్తన విశ్లేషణ మరియు పరీక్షలు

34.           కేంద్ర, రాష్ట్రాల విత్తన పరిశీలన లెబోరెటరీలు

35.           విత్తన విశ్లేషకులు

36.           విత్తన విశ్లేషకుల రిపోర్టు

37.           కోర్టుకు విత్తన విశేషణలు ఇచ్చుట

38.           విత్తన నాణ్యతను పరిశీలించే ఆధికారులు మరియు విత్తన ఇన్స్పెక్టర్లు

39.           విత్తన నాణ్యతను పరిశీలించే ఆధికారులు మరియు విత్తన ఇన్స్పెక్టర్ల అధికారాలు

అధ్యాయం-7

విత్తనాలు దిగుమతులు మరియు ఎగుమతులు

40.           దిగుమతి విత్తనాలు

                – 1986 చట్టం ప్రకారం నష్టం రాని విధంగా దిగుమతి చేసుకోవాలి.

మన సూచన :

సెక్షన్ 40లో దిగుమతి విత్తనాలను 21 రోజులు క్వారం టైన్ పెట్టి, పరిశోధనలు చేసి మన వాతావరణానికి తగినవని దృవీకరించబడిన తరువాతనే దిగమతులను మార్కెట్కు విడుదల చేయాలి. ఒక వాతావరణంలోని విత్తనాలు మరో వాతవరణంలో మొలకేత్తవు. (ఉదా. గతంలో దున్నలను దిగుమతి చేసుకోని బోన్ క్యాన్సర్ ఉండడం వల్ల డబ్బులు చేల్లించి చంపెశాం)

41.           ఎగుమతి విత్తనాలు

అధ్యాయం-8

నేరాలు మరియు శిక్షలు

42.           నేరాలు మరియు శిక్షలు (నాణ్యత సర్టిపై చేసే అధికారికి 2019 చట్టంలో)

1) రాష్ట్ర విత్తన కమిటీ, సబ్ కమిటీల ద్వారా విత్తన నాణ్యతను పరిరక్షించే అధికారిని నియమించాలి. ఆ అధికారి చట్ట ప్రకారం విధులు నిర్వహించనిచో రూ.25 వేల రూపాయల నుండి లక్ష రూపాయల వరకు పరిహరంతో శిక్షించాలి.

2) జీవవైవిద్య విత్తన రకాల విషయంలో ఈ శిక్షను రూ.25 వేల నుండి లక్ష రూపాయల వరకు విదించవచ్చు.

3) తప్పుడు సమాచారం జనటిక్ ప్య్రూరిటి, తప్పడు బ్రాండ్ మరియు నాణ్యత లేని జీవవైవిద్య విత్తనాలను, రిజిస్ట్రర్ కాని విత్తనాలను దృవీకరించినచో ఏడాది జైలు శిక్ష లేదా రూ.5 లక్షల జరిమాన లేదా రెండిటిని విదించవచ్చు.

మన సూచన :

సెక్షన్ 42లో విశ్లేషణ అధికారి లేదా నాణ్యత పరిరక్షించే అధికారిని నియమించిన పై అధికారికి ఏడాది జైలు శిక్ష, రూ.5లక్షల జరిమాన విధించాలి.

43.           అస్తుల జప్తులు

44.           విత్తన కంపెనీల నేరాలు

మన సూచన : సెక్షన్ 44లో నేరాలకు పాల్పడిన కంపెనీ లేదా కార్పొరేట్ సంస్థల లైసన్స్లను రద్దుచేయాలి. కేంద్ర, రాష్ట్ర విత్తన కమిటీల తీర్పులే అంతిమ నిర్ణయంగా ఉండాలి. వీటిపై ఏలాంటి అప్పీల్లు ఉండరాదు.  కమిటీ నిర్ణయించిన పరిహారాన్ని రైతులకు చెల్లించాలి. సెక్షన్ 21లో చూపిన శిక్షను కంపినీలపై అమలు జరపాలి.

అధ్యాయం-9

కేంద్ర ప్రభుత్వ అధికారాలు

45.           రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర ప్రభుత్వం సూచనలు ఇచ్చే అధికారం

46.           కమిటీలకు కేంద్ర ప్రభుత్వం సూచనలు ఇచ్చే అధికారం

అధ్యాయం-10

ఇతరములు

47.           చట్టంలోని అంశాల మినహాయింపులు

48.           మంచి ఉద్దేశంతో తక్షణ చర్యలు చేపట్టుట

49.           అటంకాల తొలగింపుకు అధికారాలు

50.           కేంద్ర ప్రభుత్వం రూల్స్ రూపొందించే ఆధికారం

51.           కమిటీలు క్రమబద్దికరించే హక్కులు

52.           పార్లమెంట్ ముందు రూల్ నోటిపికేషన్ పెట్టుట

53.           కొట్టివేయడము మరియు కాపాడటం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *