తెల్లదోమ – సుస్థిర వ్యవసాయ కేంద్రం

తెల్లదోమ

పురుగు ఆశించు కాలం: జులై – జనవరి

తెల్లదోమ వలన అపరాలు, టమాట వంటి పంటలలో వైరస్‌ వ్యాధులు వ్యాప్తి చెందుతాయి. తెల్లదోమ తల్లి పురుగులు ఆకులపై వృద్ధి చెంది రసంను పీలుస్తాయి. వీటి బెడద ఎక్కువగా ఉన్నప్పుడు మొక్కలు చనిపోతాయి.

పురుగు ఆశించక ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

  • తట్టుకునే రకాలను నాటుకోవడం.
  • పొలంలో ఎకరానికి 5 చొప్పున పసుపురంగు జిగురు పళ్ళాలు ఉంచి పురుగును అదుపు చేయవచ్చు. 
  • పురుగు మందులు వాడకం ఆపేస్తే పొలాలలో రైతుమిత్ర పురుగులైన జియోకోరిడ్‌ నల్లులు, ఆక్షింతల పురుగులు, క్రైసోఫా, అఫిలినస్‌ పరాన్నజీవులు తెల్లదోమను సహజంగా అదుపు చేస్తాయి. 

నివారణ :

  • 5 శాతం వావిలాకు కషాయం పిచికారి చేయడం.
  • 3 శాతం వేపనూనె పిచికారి చేయడం.
  • ఒక లీటరు కానుగ నూనె 200 లీ. నీటిలో కలిపి దీనికి కుంకుడు కాయల రసం కలిపి పిచికారీ చేసుకోవాలి. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *