వరిలో కాండం తొలుపు పురుగు – సుస్థిర వ్యవసాయ కేంద్రం

వరిలో కాండం తొలుపు పురుగు

పురుగు ఆశించు కాలం: ఏప్రిల్‌ – అక్టోబర్‌

పురుగు ఆశించక ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

  • పురుగు గుడ్లను, ఫ్యూపాలను నాశనం చేయడానికి పంట కోత పూర్తి కాగానే భూమిని దున్నుకోవాలి. 
  • 8-20 కిలోల వేప పిండిని ఆఖరి దుక్కిలో వేసి కలియ దున్నుకోవాలి. 

నివారణ: 

  • ట్రైకోడ్రామా బ్రెసిలియెన్సిస్‌, టెలినోమస్‌ ఫెలిఫెసిమెన్స్‌ కార్డులు వాణిజ్య పరంగా లభిస్తున్నాయి. ఇవి కాండంతొలుచు పురుగుల గుడ్ల సముదాయాన్ని నాశనం చేస్తాయి. 
  • పెద్ద మగ పురుగులను ఫెరమోన్‌ ఎరలను ఉపయోగించి ఆకర్షించి ఎరలు పడేటట్లు చేయవచ్చు. 
  • పసుపు దుంప కషాయాన్ని పిచికారీ చేయాలి. 
  • పొలంలో రెక్కల పురుగులను కాని, పురుగు గుడ్లను కాని గమనించిన వెంటనే  5శాతం వేప కషాయాన్ని పిచికారి చేసి గుడ్లు పెట్టడాన్ని నివారించవచ్చు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *