వరిలో గొట్టాల పురుగు – సుస్థిర వ్యవసాయ కేంద్రం

వరిలో గొట్టాల పురుగు

పురుగు ఆశించు కాలం: మార్చి – నవంబర్‌

పురుగు ఆశించక ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

మొక్కలను సరియైన దూరంగా నాటాలి.
పురుగు గుడ్లను, ఫ్యూపాలను నాశనం చేయడానికి పంట కోత పూర్తి కాగానే భూమిని దున్నుకోవాలి.
8-20 కిలోల వేప పిండిని ఆఖరి దుక్కిలో వేసి కలియ దున్నుకోవాలి.
నివారణ:

పొలంలో వున్న లార్వాలను పంటపై త్రాడులాగి నివారించవచ్చు.
చామ, నిమ్మ ఆకులను ముక్కలుగా కత్తిరించి పొలంలో వెదజల్లితే అవి పురుగు వికర్షిణిగా పని చేస్తాయి.
3-4 రోజులు పొలంలో నిలిచి ఉన్న నీటిని బయటకి పంపించాలి. లేదా నిలిచివున్న నీటిలో తాజా ఆవుపేడ వేయాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *