వరిలో సుడి దోమ – సుస్థిర వ్యవసాయ కేంద్రం

వరిలో సుడి దోమ

పురుగు ఆశించు కాలం: ఏప్రిల్‌ – అక్టోబర్‌

పురుగు ఆశించక ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

  • పొలంలో నీరు ఎక్కువగా నిలిచి ఉండకుండా చూడాలి.
  • పొలంలో పొలం గట్లపై కలుపు మొక్కలు లేకుండా చూడాలి. 
  • జిల్లేడు ఆకులకు మొక్కల వరుసల మధ్యలో వేసి భూమిలో కలపాలి. 
  • 8-20 కిలోల వేప పిండిని ఆఖరి దుక్కిలో వేసి కలియ దున్నుకోవాలి. 

నివారణ: 

  • టూటేరు ఆకు కషాయం సుడి దోమకు సమర్ధవంతంగా పనిచేస్తుంది. 
  • దీపపు ఎరలను ఉపయోగించి సుడిదోమ పెద్ద పురుగులను ఆకర్షించి నాశనం చేయాలి. 
  • ఇసుక 15 కిలోలకి 1.5 లీ. వేపనూనె బాగా పట్టించి, రాత్రంతా వుంచి ఉదయాన్నే పొలంలో చల్లితే పురుగు ఉధృతి తగ్గుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *